– ఎస్మాకు భయపడం: కార్మిక సంఘాలు
హైదరాబాద్,అక్టోబర్ 4(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. వరుసగా మూడో రోజు కూడా అధికారుల కమిటీ, కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావటంతో సమ్మె కొనసాగనుంది. దీంతో శనివారం నుంచి సమ్మె యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఎస్మాకు భయపడేది లేదని, ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్మా, పీడీ యాక్టులు తమకు కొత్తకాదని, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హావిూ ఇవ్వటం లేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సమ్మె కారణంగా ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. కార్మికుల సమ్మె యథాతథంగా జరగనుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం తరపున మంతనాలు జరిపిన త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీని బతికించడానికి జరుగుతున్న పోరాటం ఇదని, ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. నోటీసులకు ఆర్టీసీ కార్మికులు భయపడరని, సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు. డిపో మేనేజర్లు కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నామన్నారు. తాము ఎవరి చేతిలో కీలు బొమ్మలు కాదని, ప్రస్తుతం సకల జనుల సమ్మును మించిన సమ్మె అవసరమని అన్నారు. తమ సమ్మె ద్వారా ప్రజలకు కలిసి ఇబ్బందికి చింతిస్తున్నామని తెలిపారు.ఇదిలా ఉంటే… ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఆయన చెప్పారు. సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రభుత్వానికి, ఆర్టీసీకి మధ్య నలిగిపోక తప్పదేమోనని సామాన్య ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ దసరా, దీపావళి నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా టికెట్ ధరలు పెంచాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరింత బాదుడు తప్పదేమోనని ప్రయాణికులు భయపడుతున్నారు. మరోవైపు సమ్మెల్లో పాల్గొనే వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో త్రిసభ్య కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, కె.రామకృష్ణారావు, సునీల్శర్మలు శుక్రవారం కూడా చర్చలు జరిపారు. అనంతరం కమిటీ సభ్యుడు రామకృష్ణారావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కేవలం రూ.1695కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3303 కోట్లు ఇచ్చిందని త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. జీతాలు, ఖర్చులు పెరిగాయి కాబట్టి, సంస్థను ఆర్థికంగా ఆదుకున్నాం. సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కార్మికులు వినకపోవడం సరైంది కాదు. గత మూడేళ్ల నుంచి బ్జడెట్లో పేర్కొన్న దాని కంటే రెట్టింపు నిధులే ఇచ్చాం. 2016-17 బ్జడెట్లో ఆర్టీసికి కేటాయించింది రూ.237కోట్లు అయితే ఇచ్చింది రూ.536కోట్లు. 2015-16 బ్జడెట్లో ఆర్టీసీకి రూ.357 కోట్లు కేటాయిస్తే ప్రభుత్వం రూ.490కోట్లు ఇచ్చింది. 2014-15 బ్జడెట్లో ఆర్టీసికి రూ.347 కోట్లు కేటాయిస్తే రూ.599కోట్లు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఎంత అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జేఏసీ ప్రతిపాదించిన 26 డిమాండ్లలో అన్నీ అర్థిక పరమైన డిమాండ్లే. పండుగ సమయంలో సమ్మెకు దిగితే ఎవరూ హర్షించరు. ప్రజలకు ఆర్టీసీ విూద దురభిప్రాయం ఏర్పడుతుంది. ఆర్టీసీ విూద ఏర్పడ్డ చెడు అభిప్రాయం ప్రభుత్వానికి మంచిది కాదు. సమ్మెకు వ్యతిరేకంగా ఉన్నవారిని నిరభ్యంతరంగా విధుల్లోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణీలకు కోసం 2100 బస్సులను అందుబాటులో ఉంచినట్టు రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌కుమార్ వెల్లడించారు. తాత్కాలికంగా డ్రైవర్లను కూడా నియమిస్తున్నామని తెలిపారు. అన్నిజిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిపారు అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆళీ?న ఆదేశించారు. ప్రతి బస్సులో పోలీస్ఫోర్స్ను ఏర్పాటుచేస్తామని ఈసందర్భంగా ఆయన తెలిపారు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని సునీల్‌కుమార్ ప్రకటించారు. కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సమ్మెకే సై..




