సరస్వతి స్కూల్ లో సంక్రాంతి సంబరాలు
సాంప్రదాయ దుస్తులతో అలరించిన విద్యార్థులు
ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 12 మండల పరిధిలోని ఎర్రవల్లి సరస్వతి స్కూల్ లో గురువారం మకర సంక్రాంతి సంబరాలను ముందస్తుగా విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి పండుగ యొక్క ప్రాముఖ్యతను అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మకర సంక్రాంతి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే ప్రధాన పంట పండుగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల పంట కాలం ప్రారంభం ఒక రాశిచక్రం నుండి మరొకదానికి సూర్యుని కదలికను సంక్రాంతిగా పిలుస్తారని విద్యార్థులకు తెలిపారు. అనంతరం విద్యార్థులకు రంగవల్లుల పోటీ మరియు గాలిపటం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, మధులిక రెడ్డి, ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు




