సరిహద్దులు దాటుతున్న పేదోడి బియ్యం…
– కొందరు డీలర్లు దళారుల గా మారిన వైనం.
– రేషన్ షాపు దగ్గరే PDS బియ్యాన్ని కొంటున్న దళారులు.
– కలెక్టర్ సార్ దృష్టి సారించాలని వినతి.
పినపాక, సెప్టెంబర్ 23(జనంసాక్షి):-
అక్రమార్జన కి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు, దళారులతో కుమ్మకై దొడ్డి దారిన రేషన్ బియ్యం ను దారి మళ్లిస్తున్నారు. పూర్తి గ్రామీణ ప్రాంతము ఐనా పినపాక మండలంలో PDS బియ్యం సరిహద్దులు దాటుతున్నయి.దొడ్డు బియ్యం వచ్చినప్పుడు లబ్ధిదారుల నుండి రేషన్ డీలర్లు కిలో 7/- రూపాయల చొప్పున కొని మిల్లర్లకు,దళారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.సన్న బియ్యం వచ్చినప్పుడు క్వింటా 2400/- చొప్పున తమ అనుకూలంగా ఉన్న వారికి అమ్ముకుంటున్నారు.ఉన్నత అధికారులకు నెలవారీ మామూళ్లు షరా మామూలే… ఈ అక్రమ దందాలో కొందరు డీలర్లు ఆరితేరి ఉన్నారు. ఇప్పటికే పత్రిక ప్రతినిధులు పినపాక లో కొందరు రేషన్ డీలర్లు చరిత్ర సేకరించింది.