Tuesday, 3 November 2026

సర్వదేవతల సమ్మేళనం…బొడ్రాయి సంబరాలు -గ్రామంలో అన్ని కులాల వారు కలిసి చేసుకునే ఒకే ఒక పండుగా బొడ్రాయి -భక్తిశ్రదాలతో సందడిగా మారిన గొల్లచర్ల గ్రామం

 డోర్నకల్ మార్చి/2/జనం సాక్షి న్యూస్ :గ్రామంలో అన్ని కులాల వారు కలిసి చేసుకునే ఒకే ఒక పండుగా బొడ్రాయి.శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జీవద్వాజ, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో గురువారం గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పశుసంపద పాడి పంటలతో పచ్చగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని  సర్వదేవతల సమ్మేళనం…బొడ్రాయి సంబరాలు నిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు అన్నారు. గ్రామంలో ఉదయం నుండే వేద మంత్రాలతో ప్రారంభమైన వివిధ రకాల పూజ కార్యక్రమలు గ్రామం బలిహరణ – గ్రామం చుట్టూ తిరుగుతూ 8 భైరవ కుర్రుల ప్రతిష్ట, జలాధివాసం- భక్తులు విగ్రహాలపై ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి,పంచదార మరియు నీళ్లతో అభిషేకం చేశారు. ధన్య దివాసం, పుష్ప దివాసం, శయ్యదివాసం, బొడ్రాయి తల్లి గౌరీ దేవి స్వరూపము,గ్రామ ఆడపడుచు కానుక మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ పలు రకాల వస్తువులు సమర్పించారు.అదేవిధంగా మహిళలచే సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు.అదేవిధంగా రేపు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జీవద్వాజ,బొడ్రాయి ప్రతిష్ట  మహోత్సవాలు కలదు. కావున గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందగలరని బొడ్రాయి గ్రామ విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలోబొడ్రాయి కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.