కురవి మార్చి /2/ జనం సాక్షి న్యూస్:కురవి మండలంలోని ఇస్లావత్ తండా గ్రామంలో గురువారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం జిల్లా షీ టీం,భరోసా సెంటర్ ఇన్చార్జ్ ఆఫీసర్ మోహన్ సిఐ ఆధ్వర్యంలో ఇస్లావత్ తండా గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంలో మోహన్ సిఐ మాట్లాడుతూ ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను వేధించిన లేదా ఇబ్బందులకు గురిచేసిన, వారి మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తించిన వారిపైన షీ టీం వాళ్లకు గాని ,భరోసా సెంటర్ వాళ్లకు గాని వాళ్లు ఫిర్యాదు చేయొచ్చని అలాగే ఎవరైనా ఆడపిల్లలు అలా ఫిర్యాదు చేస్తే వారికి సంబంధించినటువంటి షీ టీమ్ వాళ్లు మఫ్టీ లో వచ్చి వారి యొక్క సమస్యను తెలుసుకొని వారి వద్దనుండే పిటిషన్ తీసుకొని తగు న్యాయం చేస్తారు. అలాగే బాల్యవివాహాలు గురించి కూడాను వారికి వివరించడం జరిగింది ఎవరైనా చిన్నపిల్లలకు వివాహాలు చేసినట్లయితే అట్టి సమాచారాన్ని 1098 అనే నెంబర్కు కాల్ చేసి సమాచారం తెలియపరచగలరు అని ఆయన అన్నారు.చిన్న వయసులో పిల్లలు అనేక చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని అలాగే చెడు అలవాట్లుకు బానిసవడం వల్ల చిన్న పిల్లలు పదో తరగతిలోనూ ,ఇంటర్మీడియట్ లోనే అడ్డదారులు తొక్కి దొంగతనాలకు అలవాటు పడుతున్నారని తెలియపరిచారు. కావున తల్లిదండ్రులు అందరు కూడాను వారిని పట్టించుకోని వారి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మొక్క దశలోనే వాళ్ళని కరెక్టుగా గైడ్ చేయాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో కురివి ఎస్సై బి రాము నాయక్, ఆర్ఎస్ఐ సునంద, ఏఎస్ఐ సదయ్య, షీ టీం సభ్యులు, కానిస్టేబుల్ హరీరామ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రత, బాల్య వివాహాల నిషేధం గురించి అవగాహన సదస్సు




