సర్వేనెంబర్ 45లో ప్రభుత్వ భూమి చౌదర్‌చేరువు భూమి కబ్జా

ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన నీల్ల సంపు వైకుంఠదామం దారి బోర్డు అక్రమంగా కూల్చివేత

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్04(జనంసాక్షి):-
యాచారం మండలం చౌదర్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 45 లో.12-2500 గుంటల ప్రభుత్వ షిఖం పట్టా/ షికం ప్రాజెక్ట్ భూమి కలదు.గత కొన్ని సంవత్సరాల క్రితం. ఈ భూమిలో గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి బోర్‌మోటర్‌ నుండి పైప్ లైన్ వేసి వాటర్‌చేడ్ ( నీల్ల హౌస్) వైకుంఠధామం దారి మళ్లింపు బోర్డు నిర్మించారు. ఈయొక్క చౌదర్‌ చెరువులో వైకుంఠదామం కూడా నిర్మించారు . ప్రభుత్వం నిర్మించిన ఈ నీళ్ల సంపు లో ఎండాకాలంలో ముగ జీవాలకు పశువులకు గొర్రెలకు. నీళ్లు త్రాగడానికి నీళ్ల సంపు ఎంతగానో ఉపయోగపడేది. మరియు చౌదర్‌పల్లి గ్రామ యువకులకు ఈ చేరువు క్రీడ ప్రాంగణంగా మారింది. యువకులు క్రీడల్లో అలిసిపోయి నీళ్ల హౌస్ దగ్గర విశ్రాంతి తీసుకునేవారు. మంచి చెడు కార్యకలాపాలకు ఉపయోగపడేది. ప్రభుత్వ నీళ్ల హౌజ్ మరియు పైప్ లైన్‌ని. కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాత్రికిరాత్రే నీటి సంపుని కూల్చి నామరూపం లేకుండా చేసారు. ఆ నీటి సంపు దగ్గరనే కొన్ని గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే. ఈ చెరువు షికం భూమి మత్స్యకారుల చేపల పెంపకం కోసం కేటాయించబడిందని. ఇట్టి విషయం గ్రామ సర్పంచ్ కి పంచాయతీ సెక్రటరీ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అంటున్నారు అధికారులు వెంటనే స్పందించి నీళ్ల సంపుని వెంటనే అక్కడే నిర్మించి ప్రభుత్వ భూమి కబ్జాకు మళ్లీ గురి కాకుండా చూడాలని నీటి సంపుని కూల్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నరసింహ గ్రామస్తులు పాల్గొన్నారు

తాజావార్తలు