Saturday, 7 November 2026

సర్వే నంబర్లు తొలగించారని కలెక్టర్ కు పిర్యాదు.

సర్వే నంబర్లు తొలగించారని కలెక్టర్ కు పిర్యాదు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 19. (జనంసాక్షి). మున్సిపల్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ లో భూములకు సంబంధించిన సర్వే నంబర్లు తొలగించారని పలువురు సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్ లో గల సర్వే నంబర్960/బి లో గల పట్టాదారులమైన తాము మున్సిపల్ అధికారుల వైఖరి వల్ల ఇబ్బందుల పాలవుతున్నామని పేర్కొన్నారు. ఏకంగా మున్సిపల్ రికార్డుల్లో సర్వే నంబర్ లేకుండా చేశారని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో శ్రీహరి, పెంటయ్య ,మోహన్లాల్, ప్రమీల, సుమలత, తదితరులు ఉన్నారు.