Friday, 6 November 2026

సాంకేతిక పరిజ్ఞానం వల్ల చాలా ఉపాయోగాలు : జేపీ

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం నేపధ్యాన్ని మర్చిపోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోక్‌సత్తా శ్రేణులకు అధినేత జయప్రకాష్‌ నారాయణ సూచించారు.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని లోక్‌సత్తా కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ ఆన్‌లైన్‌ సభ్యత్వనమోదు కార్యక్రమాని తొలిసారిగా ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి నాయకుల సమక్షంలో ఆయన స్వయంగా తన పేరును నమోదుచేసు కున్నారు. సాంకేతికత సాయంతో సభ్యత్వనమోదు ద్వారా విద్యావంతులకు చేరువకావాలని లోక్‌సత్తా భావిస్తోందని, దీనిలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు జేపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *