సాంకేతిక రంగంలో యువతకు మంచి భవిష్యత్తు
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ.
మిర్యాలగూడ, జనం సాక్షి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక రంగంలో యువతకు మంచి భవిష్యత్తు ఉందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ లు అన్నారు. గురువారం రాత్రి
స్థానిక మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఆగమన వేడుకలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఇది యువత భవిష్యత్తును ఆశించి కోటి ప్రపంచంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వాటిని సాధించే దిశలో ప్రణాళిక బద్ధంగా క్రమశిక్షణతో మంచి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సీనియర్ విద్యార్థినిలు జూనియర్ విద్యార్థులకు మంచి సలహా సూచనలు ఇవ్వాలని సూచించారు. ఘనంగా నిర్వహించారు ఈ విద్యా సంవత్సరం గాను బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థిన. సీనియర్ విద్యార్థులు జూనియర్స్ కి తగిన సలహాలు సూచనలు మరియు అనుభవాలను ఆపాదించడంతో మంచి వాతావరణం నెలకొంటుందన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలను మరియు జ్ఞానాన్ని సహచర విద్యార్థులతో పంచుకోవాలన్నారు. ఒత్తిడి లేని వాతావరణంలో విద్యను అభ్యసించడం వల్ల తాము అనుకున్న విజన్ త్వరగా చేరుకోవచ్చు అన్నారు. విద్యార్థులకు రక్షణ వలయం లాగా మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎంతో తోడ్పాటును ఇస్తుందన్నారు. కళాశాల చైర్మన్ ఎండి మహబూబ్ అలీ మాట్లాడుతూ జీవితం చాలా విలువైనదని సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యం వైపు ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్స్ మరియు ప్రిన్సిపల్స్ పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ చావూస్. మక్దుమ్ పాషా , ఉదయభాస్కర్, సత్యం, కళాశాల డైరెక్టర్ షహలాభుతుల్, డాక్టర్ బడే సాహెబ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాణి, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు
సాంకేతిక రంగంలో యువతకు మంచి భవిష్యత్తు




