Tuesday, 3 November 2026

సాగర్‌ ఎడమ కాలువకు రబీకి 48 టీఎంసీల నీళ్ళు

8

యుద్దప్రాతిపదికన మిషన్‌ కాకతీయ మంత్రి హరిశ్‌ రావు

నల్లగొండ డిసెంబర్‌,14 (జనంసాక్షి): సాగర్‌ ఎడమ కాలువకు రబీకి 48 టీఎంసీ నీటిని అందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఎడమ కాలువ ఆయకట్టులో రైతులు పంటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయనీ వెంటనే నీటిని విడుదల చేయాలనే విజ్ఞప్తికి హరీశ్‌ అక్కడిక్కడే సానుకూలంగా స్పందించారు. వారంరోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి హరీష్‌రావు మిషన్‌ కాకతీయపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ పూర్తయితే నాగార్జున సాగర్‌ డ్యామ్‌లో కంటే ఎక్కువ నీళ్లు వస్తాయని తెలిపారు. చెరువుల పునరుద్ధరణతో చెరువులు, కుంటల కిందున్న బావులు, బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది. మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణలోని చెరువులు, కుంటలకు పూర్వపు స్థితిని తీసుకువస్తమని హావిూనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *