Thursday, 5 November 2026

సాగునీటి విషయంలో రైతుల ఆందోళన

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని బొప్పాన్‌పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్‌ కెనాల్‌ 26 వద్ద ఆయకట్టు రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక పక్క పంట ఎండిపోతుంటే తూమును ఎందుకు మూసివేశారని అధికారులను నిలధీశారు. ఈ ఆందోళనలో రైతులకు, అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది. రెవెన్యూ ఇన్‌స్పెక్టరు అన్నె సిద్దయ్య, ఇరిగేషన్‌ ఏఈ భూమన్న రైతులకు నచ్చచెప్పి, నీటిని విడుదల చేయడంతో వారు శాంతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *