సామాజిక కార్యకర్త కర్నే రవికి జన్మదిన శుభాకాంక్షలు
పినపాక నియోజకవర్గం జూన్ 15 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త నిరుపేదల ఆశాజ్యోతి అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రతిఘటించి సామాన్యుడు కర్నె రవి కి మిత్రులు నాగర్జున రెడ్డి, భాస్కర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప మనసున్న మారాజు ముందుచూపు కలిగిన పోరాట యోధుడు ఎంతటి జటిలమైన సమస్య ఎదురైనా తన చేతలతో వాక్చాతుర్యంతో పేద ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సేవా కార్యక్రమాలు నిరుపేదలకు జరిగే అన్యాయాలపై నిత్యం పోరాడుతూ ఎన్ని బెదిరింపులు చేసిన వెనకడుగు వేయని మగధీరుడు. తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పర్చుకోని వాటికే ప్రాధాన్యం ఇవ్వడంపై విజ్ఞులందరి తోపాటు మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఏదైనా తీసుకోవటం కాదు ఇవ్వటంలోనే మనిషి వ్యక్తిత్వం కనబడుతుంది. తీసుకుంటే మనస్సు బరువుతుంది ఇస్తే తేలికవుతుంది అదే అతని సేవా మార్గానికి తొలిమెట్టు అయింది. అలుపెరుగని ఈ ప్రయాణం ఎంతోమంది నిరుపేదలకు జీవనం చేకూరుతుందని ఆశిద్దాం నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో రవి కి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ మిత్రులు తెలిపారు.