అఫ్జల్ ఖాన్:శామీర్ పేట్, జనంసాక్షి :గురువారం ఉద్యమ కారులు, ప్రముఖ గాయకుడు , గిడ్డంగుల శాఖా చైర్మన్ సాయిచంద్ గుండె పోటుతో మరణించటంతో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ ఏసమావేశమైన సాయిచంద్ పాటతో ప్రారంభమయ్యేదని ఇప్పుడు ఆయన మృతి ని ఎవరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. కేసీఆర్, కేటిఆర్,కవిత ,హరీష్ రావు ల తో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యారని , ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అఫ్జల్ ఖాన్ తెలిపారు.
సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం.




