Tuesday, 3 November 2026

సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుక

హుజూర్ నగర్ జులై 3 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తినారు. సోమవారం గురు పౌర్ణమి సందర్బంగా షిరిడి సాయిబాబా మందిరం నందు ఉదయం 5-00 గంటల నుండి 6:30 నిమిషాల వరకు పంచామృతములతో ఆవుపాలు, తేనే, నెయ్యి, పెరుగు, పంచదార, పండ్లరసాలు, విభూతి, గంధం, పన్నీరు తో అభిషేకాలు నిర్వహించారు. అలంకరణ విశేష పూజ. మంత్రపుష్పము. ఉదయం 8-30 గంటల నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు శ్రీ అన్నమయ్య భజన బృందం వారిచే అద్భుతమైన భజన, సాయి నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. అనంతరం సాయి సమాజం తరఫున గురువులను ఘనంగా సన్మానించి, సత్కరించడం జరిగింది. తదుపరి మధ్యాహ్న హారతి, అన్నప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం బాబాకి మల్లెపూల పుష్పాలతో పూజ, పల్లకి సేవ, అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు త్రిపుర మల్ల అంజయ్య, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగేశ్వరరావు, బాచి మంచి కొండయ్య, భద్రీనాద్, వెన్న పద్మ, అనంతలక్ష్మి, సరస్వతి, శ్రావణి, సుబ్బమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.