Thursday, 5 November 2026

సార్క్ దేశాధినేతలకు ప్రధాని మోడీ అభినందనలు

ఢిల్లీ: ప్రపంచకప్ క్రికెట్ పోటీ ముందు సార్క్ దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌తో మోడీ ఫోన్‌లో మాట్లాడారు. వరల్డ్ కప్ సార్క్ దేశాల మధ్య అనుబంధం పెంచుతుందని మోడీ అభివర్ణించారు. క్రికెట్ కు సంబంధించిన పలు అంశాలపై మోడీ, షరీఫ్ లు చర్చించుకున్నారు. విదేశాంగ సమావేశం జరపాలని ఈ సందర్భంగా మోడీకి నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. సార్క్ దేశాల యాత్రకు విదేశాంగ కార్యదర్శిని పంపేందుకు మోదీ ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *