హైదరాబాద్ జనంసాక్షి : జమ్మూకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఆర్మీ మేజర్ తాహెర్ హుస్సేన్‌ఖాన్ మృతదేహానికి ఆయన స్వగృహంలో సైనికలాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఉదయం ఆర్మీ అధికారులు సూరారంలోని తాహెర్ ఇంటికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం కొంతసేపు ఉంచిన అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.




