Tuesday, 3 November 2026

సాహితీ సృజనకారుల ఆత్మ బంధువు

 

సాహితీ సృజనకారుల ఆత్మ బంధువు, సాహితీవేత్త, నిజాం వెంకటేశం మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పేదరికంలో వున్న తెలంగాణ రచయితలు కవుల బాగోగులను కనిపెట్టుకుంటూ, వారికి చేదోడువాదోడుగా వుంటూ, తెలంగాణ సాహిత్యం పట్ల నిజాం వెంకటేశం కనబరిచిన ఆత్మీయతానుబంధం గొప్పదని సిఎం అన్నారు. వారి మరణం సాహిత్య రంగానికి తీరని లోటని,. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.