– నేడే చెల్లించండి
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,సెప్టెంబర్ 28,(జనంసాక్షి): సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్ సొమ్ము శుక్రవారం చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. లాభాల బోనస్, దీపావళి బోనస్‌ను కలిపి కార్మికులకు రేపే ఇవ్వాలని స్పష్టంచేశారు. దీపావళి బోనస్ రూ.55వేలతో పాటు లాభాల్లో 25 శాతం బోనస్‌గా చెల్లించాలని ఇదివరకే సీఎం ఆదేశించారు. దీనిపై సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందిస్తూ.. రెండు బోనస్‌లను కలిపి చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్టు చెప్పారు.





