సింగిల్ ఇంజన్‌తోనే తెలంగాణ ప్రగతి
విూరాష్టాల్ల్రో అభివృద్ది గురించి చెప్పగలరా: మంత్రి
సూర్యాపేట,జూలై4(జనం సాక్షి): తెలంగాణాలో బీజేపీ డబల్ ఇంజన్ వస్తే ప్రజలకు మ్దదెల దరువే అని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, మోదీ సభ అంశాలపై మంత్రి మాట్లాడుతూ… ప్రధాని
మోదీతెలంగాణపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగక్కారని మండిపడ్డారు. కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని భయపడ్డారన్నారు. అన్ని రాష్టాల్ర కంటే తెలంగాణాకు తక్కువ నిధులు ఇచ్చారని అన్నారు. టెక్స్‌టైల్ పార్క్ ఎప్పుడో రావలసి ఉందని, ఇప్పటికీ వచ్చేంత వరకు నమ్మలేమని తెలిపారు. దేశ ప్రజలు నూతన అజెండా కోసం ఎదురు చూస్తున్నారని కేసీఆర్ అన్నందుకే హైదరాబాద్ బీజేపీ నేతలు వచ్చారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన నూతన అజెండా అంశం చర్చనీయాంశంగా మారుతుందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పిలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన సోమవారం విూడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలో సింగిల్ ఇంజన్ సర్కార్‌తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌లో ఏ రాష్టాల్ల్రో అభివృద్ధి జరుగుతోందని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్టాల్ల్రో చూపాలన్నారు.కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. దేశం నుంచి బీజేపీ ప్రభుత్వం పోవాలన్నారు.