Tuesday, 3 November 2026

సిఎం సహాయనిధికి 15 లక్షల చెక్కు అందచేత

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం చేస్తున్న సహాయానికితోడు తన వంతు సాయంగా సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ అధినేత స్పందించారు.ఈమేరకు సంస్థ అధినేత సత్తిబాబు 15లక్షల రూపాయల చెక్కును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. భారీ వర్షాలతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తోడ్పాటుగా తాను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేసినట్టు ఆయన తెలిపారు.