శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్‌ ప్రారంభం

నాగర్‌కర్నూల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 1, 2 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. విద్యుత్‌ ఉత్పత్తిని మంత్రి జగదీశ్‌ రెడ్డి, ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు ప్రారంభించారు. అనంతరం పవర్‌ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిగతా నాలుగు యూనిట్లలో త్వరలోనే విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్లాంట్‌ మరమ్మతులు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. గత వారం రోజులుగా ట్రయల్‌ రన్‌ చేసి..  విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన శ్రీశైలం పవర్‌ హౌజ్‌లో మంటలు చెలరేగి విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. పునరుద్దరణను ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు చెప్పారు.