సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
* మిర్యాలగూడలో పోస్టర్ ఆవిష్కరణ
మిర్యాలగూడ, జనం సాక్షి.
ఈనెల 21 22 23 తేదీలలో సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు ప్రభుత్వ రంగ సమస్యలను బహుళ జాతి సంస్థలకు బిజెపి ప్రభుత్వం ధారా దత్తం చేస్తుందని విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు. 23వ తేదీన భారీ బహిరంగ సభ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ మహాసభలకు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు అధ్యక్షత వహిస్తారని కేరళ కార్మిక శాఖ మంత్రి వి. శివన్ కుట్టి, అఖిలభారత అధ్యక్షురాలు కే హేమలత, జాతీయ ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబా హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ మహాసభలకు కార్మిక నాయకులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, తిరుపతి రామ్మూర్తి, ఎం రవి నాయక్, పాదూరి శశిధర్ రెడ్డి, గుణగంటి రామచంద్రు,రామారావు, లక్ష్మీనారాయణ, ఎండి గౌస్, తదితరులు పాల్గొన్నారు.




