Thursday, 5 November 2026

సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌.. 

ఎవరికి ఇచ్చినా మద్దతిస్తా
– పరిపూర్ణా బహిష్కరణపై చినజీయర్‌ ఎందుకు మాట్లాడటం లేదు?
– కేసీఆర్‌ ప్రతి చర్య గవర్నర్‌ సమర్ధించడం సరికాదు
– విలేకరుల సమావేశంలో వి.హెచ్‌ హన్మంతరావు
హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఎవరికి ఇచ్చినా మద్దతిస్తానని ఆ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై చినజీయర్‌ స్వామి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న బీజేపీ నాయకుల్ని అరెస్ట్‌ చేశారంటే ఏమనుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ప్రతీ చర్యను గవర్నర్‌ సమర్థించడం సరికాదన్నారు. అన్నిరాజకీయపార్టీలు ఛలో ప్రగతిభవన్‌ కార్యక్రమం నిర్వహించాలని వీహెచ్‌ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందన్నారు. కేవలం సొంత లాభాలకోసమే తెరాస
నేతలు పాలనను వినియోగించుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌, కొత్త పథకాల పేరుతో కోట్లు దండుకుంటున్నారని విమెచ్‌ ఆరోపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో రైతుబంధు, రైతుబీమా పథకాల పేరుతో రైతులను కేసీఆర్‌ మభ్య పెడుతున్నారన్నారు. రైతుబంధు పథకంతో సన్న, చిన్న కారు రైతులకు ఒరిగిన లబ్ధి ఏవిూ లేదని, కేవలం ధనిక రైతులకు మాత్రమే కేసీఆర్‌ లబ్ధిచేసేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారని విమర్శిచారు. రైతుబంధు పథకంలో కౌలురైతులకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం దారుణమని, కౌలు రైతులంతా ఏకమైన కేసీఆర్‌ను ఓడించేందుకు సిద్ధం కావాలని వీహెచ్‌ పిలుపునిచ్చారు.