సిద్దిపల్లెలో బతుకమ్మ చీరలు పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 06 : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం లోని సిద్ది పల్లె గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం కమాన్పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మి రవి, గ్రామ సర్పంచ్ తాటికొండ శంకర్ చేతుల మీదుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాబు సతీష్, ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మి మల్లు, ఎంపీఓ శేషయ్య సూరి, బంగారు గట్టయ్య, రేషన్ డీలర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.