సిద్దిపేట ఘటనతో రాజకీయ వేడి
సిరియస్‌గా తీసుకున్న బిజెపి నేతలు
హైదరాబాద్,అక్టోబర్27(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడే కొద్ది రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే రణరంగాన్ని తలపిస్తోంది.!. సిద్దిపేట ఘటన తరవాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్‌తో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఆయన అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్‌లో ఎంపీ కార్యాలయం బీజేపీ నేతలు ఎదుట టెంట్లు వేశారు. సంజయ్‌కు మద్దతుగా కార్యకర్తలు, నేతలు దీక్షలో కూర్చున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మరోవైపు.. బండి అరెస్ట్‌కు నిరసనగా ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు చలో ప్రగతిభవన్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రగతి భవన్‌వద్దకు వందల సంఖ్యలో చేరుకుంటున్నారు.ఇదిలా ఉంటే.. రఘునందన్ రావు మామ, బంధువుల ఇంటిపై పోలీసుల దాడి చేసిన వ్యవహారాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. సంఘటనపై, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసే యోచనలో అభ్యర్థి ఉన్నారు. మరోవైపు.. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే యోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. ఉప ఎన్నికల సందర్బంగా జరుగుతున్న పరిణామాలపై బీజేపీ కేంద్ర పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటు అభ్యర్థి రఘునందన్ రావుకు ఫోన్ చేసి కేంద్ర ¬ం మంత్రి అమిత్ షా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడికి నిరసనగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ, బీజేవైఎం ప్రగతి భవన్ ముట్టడికి నేడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.