హైదరాబాద్,నవంబర్20(జనంసాక్షి): సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వెలువడుతున్న తరుణంలో అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు సినిమాలు చేసే సమయం లేదన్నారు. దీనిపై ఆయన తాజాగా సోషల్‌విూడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజంలేదని తెలిపారు. సినిమాల్లో నటించే సమయం లేదని అన్నారు. పార్టీకే పూర్తి సమయం కేటాయించానని పేర్కొన్నారు. ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణంలో సినిమాలపై దృష్టిసారించలేనని చెప్పారు. తన ఆలోచనలన్నీ ప్రజాక్షేమం కోసమేనని, తన తపనంతా సమసమాజ స్థాపన కోసమేనని వెల్లడించారు పవన్. చివరిగా పవన్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేశ్ కథానాయికలుగా నటించారు. కానీ ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు.




