సిపిఎస్ రద్దు కోరుతూ ఆందోళన
విజయనగరం,ఆగస్ట్4(జనం సాక్షి ): సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎపి సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం సత్యాగ్రహ దీక్ష ప్రారంభమయ్యింది. జిల్లావ్యాప్తంగా కుటుంబ సభ్యులతో సహా ఉద్యోగులు దీక్షలో కూర్చొన్నారు. దీక్షకు వైసిపి జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, యుటిఎఫ్, ఎపిటిఎఫ్, పెరూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, తదితరులు మద్దతు తెలిపారు. సిపిఎస్ రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్‌ను రద్దు చేయకుంటే రానున్న ఎన్నికల్లో సిపిఎస్‌ను రద్దు చేసే వారికే ఓట్లు వేస్తామని, ప్రభుత్వం వెంటనే జీవోను తెచ్చి సిపిఎఎస్ను రద్దు చేయాలని సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.