రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఏప్రిల్ 8. (జనంసాక్షి). ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రధాని మూల ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. శనివారం సిపిఐ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు పంతం రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని గురించి తప్ప సామాన్య ప్రజల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విద్వేష రాజకీయాలతో ప్రజల్లో చిచ్చు పెడుతున్న మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. నిరసన కార్యక్రమంలో నాయకులు కడారి రాములు, మంచి కట్ల రమేష్, వడ్డేపల్లి లక్ష్మణ్, వేణు పలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..




