Friday, 6 November 2026

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి

గుంటూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లాలో మంత్రి నక్కా ఆనందబాబు శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా వేమూరు మండలం బలిజేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎస్సీ కాలనీలో 50 ఎన్టీఆర్‌ గృహానిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.70 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇళ్లు నిర్మాణానికి ఎస్సీలకు అదనంగా రూ.75 వేలు సహాయం చేస్తున్నామన్నారు. సబ్‌ఎ/-లాన్‌ నిధులు పూర్తి స్థాయిలో ఎస్సీల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.