Friday, 6 November 2026

సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు అశోక్‌ చక్ర

న్యూఢిల్లీ: ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు అశోక్‌ చక్ర ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది శౌర్యసాహసాలకు గుర్తింపుగా లభించే రాష్ట్రపతి పోలీస్‌ పతకం 13 మందికి, పోలీస్‌ పతకం 113 మందికి ప్రదానం చేయనున్నారు. అరుదైన సేవలకు గాను 84 మందికి, ప్రతిభావంతమైన సేవలకు గాను 682 మందికి పోలీస్‌ పతకాలు బహూకరించనున్నారు. జైళ్ల శాఖలో అత్యుత్తమ సేవలందించిన మరో 28 మందికి పతకాలను అందజేయనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా వీరందరికీ పతకాల ప్రదానం జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *