హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ నేతృత్వంలోని పాలన పేకాట ఆగినట్లుగా ఉందని మాజీ కేంద్రమంత్రి, బాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన ఆధ్వాన స్థితిలోకి వెళ్లిందని, సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సీఎం కిరణ్‌కు 59వ బహింరగలేఖ రాశారు. రాష్ట్రప్రజలు రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వం కనీస నిరారణ చర్యలు తీసుకోవడం లేదనీ ఫలితంగా రోగగ్రస్త ఆంద్రప్రదేశ్ గా మారిందన్నారు. ఒకప్పుడు విద్యుత్‌లో మిగులు రాష్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ చీకటి రాష్ట్రంగా మారింనందుకు సర్కారు అవలంబిస్తున్న విధానాలే కారణమని లేఖలో పేర్కొన్నారు. అవినీతి మంత్రులపై తక్షణం కేబినేట్ నుంచి తొలగించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎంకు సూచించారు.




