జనం సాక్షి:హైదరాబాద్: కొత్త జోనల్ వ్యవస్థ, రైతు జీవిత బీమాపై చర్చ, ఆమోదం ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. వీటితో పాటు పలు ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీపైనా సీఎం సమీక్షించనున్నారు. పంపిణీ ప్రక్రియను సంపూర్ణంగా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. జూలైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోన్న ప్రభుత్వం… ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంపు, దేవాదుల-తుపాకులగూడెం ప్రాజెక్టులకు నిధుల కోసం ఏర్పాటు చేసిన కార్పోరేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటితో పాటు రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ, చేయాల్సిన ప్రకటనలు, రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్




