Wednesday, 4 November 2026

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు : క్రాంతి కిరణ్

– ఆదరిస్తున్న అందోల్ ప్రజలకు రుణపడి ఉంటానన్న ఎమ్మెల్యేమునిపల్లి, ఆగష్టు 21, జనంసాక్షి :తనపై నమ్మకం ఉంచి రెండవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన్నందుకు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, సీఎం కేసీఆర్ కు ధన్యవాదలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రెండు కళ్లుగా ఉన్న హరీష్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు చెప్పారు. తనను ఆశీర్వదిస్తూన్న అందోల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణలో, అందోల్ నియోజకవర్గంలో మరో సారి గులాబీ జెండా ఎగురావేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.