Tuesday, 3 November 2026

హైదరాబాద్ కు బస్సు ప్రారంభం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ నుండి హైదరాబాద్ కు, తిరుగు ప్రయాణం లో మియాపూర్ నుండి రామకృష్ణాపూర్ బీజూన్ మీదుగా బస్సు ప్రారంభం అయ్యింది.
ఈ క్రమం లో రాజీవ్ చౌక్ చేరుకున్న ఆర్టీసీ బస్సును జేఏసీ నాయకులు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు జంగంపల్లి మల్లయ్య, సిఐటియు నాయకులు సాంబార్ వెంకటస్వామి, టిడిపి పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు సంజయ్ కుమార్, డాక్టర్ సలీం, దుర్గాభవాని ఆర్టీసీ కౌంటర్ నిర్వాహకుడు కుమార్ సింగ్ లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కరోనాకు ముందు ఆర్టీసీ సేవలు కొనసాగించేవారని, కరోనా తర్వాత ప్రయాణికులు తక్కువ ఉండడం చేత బస్సు నిలిపివేశారని అన్నారు. పార్టీల వినతి పత్రాల ద్వారా డిపో మేనేజర్ కు విన్నవించగా సానుకూలంగా స్పందించి సోమవారం రాత్రి నుండి హైదరాబాద్ కు బస్సు సర్వీసులు ప్రారంభించారని తెలిపారు. సింగరేణి కార్మికులకు, విద్యార్థులకు, ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు బస్సు డ్రైవర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. టిఎస్ఆర్టిసి చైర్మన్ కి ఈ సందర్భంగా జేఏసి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.