సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
మోత్కూరు డిసెంబర్ 9 జనంసాక్షి : తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి-మేఘారెడ్డి శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన కొల దినేష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 40 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, వార్డు కౌన్సిలర్ పురుగుల వెంకన్న,మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను,నాయకులు అన్నందాసు విద్యాసాగర్,పురుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




