సీఎం సహాయ నిధి పేదలకు వరం : మంత్రి మల్లారెడ్డి
శామీర్ పేట్, జనంసాక్షి : పేద ప్రజల సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. లాల్ గడి మలక్ పేట్ కు చెందిన తలారి పోచయ్య కుమారుడు నర్సిహ్మ తీవ్రమైన అనారోగ్యంతో ప్రయివేట్ అస్పత్రిలో చికిత్స తీసుకోని సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చెయ్యగా గురువారం మంత్రి మల్లారెడ్డి తలారి నర్సిహ్మ కు 1 లక్ష 25 వేల రూపాయల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్, కొమ్ము వెంకటేష్, మేడి గణేష్, డేవిడ్, తదితరులుపాల్గొన్నారు.