Friday, 6 November 2026

సీఎల్పీ నేత బట్టి పాదయాత్రలో పాల్గొన్న శ్రీధర్ బాబు

 జనం సాక్షి, మంథని : అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజరహత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మాజి మంత్రి, మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఇచ్చోడలో కార్నర్ మీటింగ్ లో శ్రీధర్ బాబు ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలిలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలోని పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ ఠాక్రే జెండా ఊపి ప్రారంభించారు.