Wednesday, 4 November 2026

సీఎస్ సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

శివ్వంపేట జూన్ 13 జనంసాక్షి : ఈనెల 15న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి శివ్వంపేట మండల పర్యటన కు వస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జెడ్పి సీఈవో శైలేష్, డిఆర్డిఓ పిడి శ్రీనివాస్, డిపిఓ సాయిబాబాలు జిల్లా అధికారుల బృందం మంగళవారం మండల పరిధిలోని శభాష్ పల్లి గ్రామాన్ని సందర్శించి, సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో పలు విధుల గుండా తిరుగుతూ సంపూర్ణ పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. హరితహారంలో నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డు ల ఏర్పాటు చేయాలనీ, స్తభాస్థలినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సభలోనీటి సదుపాయంతో పాటుగా కూలర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డంప్ యాడ్ వద్ద ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంలో స్వాగత తోరణం, అలాగే మట్టిరోడ్డును నిర్మించాలని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. స్మశాన వాటిక వద్ద అలాగే హరితహారం లో పెంచిన మొక్కల వద్ద సూచిక బోర్డును అదేవిధంగా మినీ సింటెక్స్ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్థానిక ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, ఎంపీడీవో కాసం నవీన్ కుమార్ లకు సూచించారు. పల్లె ప్రకృతి వనం నుంచి గ్రామంలో వరకు ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సమయంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్ రాం రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రంగపల్లి పార్వతి సత్యం, పంచాయతీ కార్యదర్శి, వీణా, ఎంపీఓ తిరుపతి రెడ్డి, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో అనిల్ కుమార్ వార్డు సభ్యులు ఉస్మాన్, శంకర్, లక్ష్మి, పోచమ్మ తదితరులున్నారు.