Wednesday, 4 November 2026

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

– పారిశుద్ధ్య, ఆరోగ్యంపై అవగాహన అవసరం
– ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
కాకినాడ, నవంబర్‌3(జ‌నంసాక్షి) : సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్‌ఓ టి.ఎస్‌.ఆర్‌ మూర్తి,  స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూచించారు. మండపేట లోని ధర్మగుండచెర్వు సీతారామ కమ్యూనిటి హల్‌ లో శనివారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్సులతో ఆరోగ్య పరిస్థితి, పారిశుద్ధ్య నిర్వహణ తడిదర అంశాలపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మూర్తి, రాజమహేంద్రవరం డివిజన్‌ పంచాయతీ అధికారి ఎం వరప్రసాద్‌ లు పాల్గొన్నారు. మండల, గ్రామ అధికారులతో సీజనల్‌ వ్యాధుల పై సవిూక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ.. చలి కాలం ఆరంభం కావడం వల్ల అంటువ్యాధులు మలేరియా, డెంగ్యూ విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని అందువల్ల వైద్య, పంచాయితీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని కేసులు నమోదు అయ్యాయన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పరిశుభ్రతపాటించాలన్నారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలకు వారి ఇంటి దగ్గర చెత్త చెదారం నిలువున్న నీటి కుంటలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. తినే ఆహార పదార్ధాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచి చల్లార్చిన నీళ్లని మాత్రమే తాగాలన్నారు. ఆ విధంగా అవగాహన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ గ్రామ పంచాయితీ పరిధిలో వున్న గ్రామల పై సంబంధిత అధికారులు వైద్య శాఖ, డీపీఓ, సిఇఓ, మలేరియా అధికారి, డిఆర్డీఏ, మెప్మా, ఐ.సిడి.ఎస్‌ అధికారులు చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసి అమలు చేయాలన్నారు. మలేరియా వ్యాధి రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామనీ చెప్పారు. గ్రామాల్లో మలేరియా వ్యాధి ప్రభలకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. మందులు కూడా పి. హెచ్‌ సిలో అందుబాటులో ఉంచామని వివరించారు. జిల్లాలో ఎవ్వరూ ఈ వ్యాధితో బాద పడకుడదని మలేరియా, డెంగ్యూ లక్షణాలు కబడిన వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్‌సీ లేదా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి డాక్టరును సంప్రదించి తగు వైద్యం పొందాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చైర్‌ పర్సన్‌ చుండ్రు శ్రీ వర ప్రకాష్‌ ,జిల్లా గ్రంధాలయా సంస్థ చైర్మన్‌ నల్లమిల్లి వీరెడ్డి,జిల్లా టీడీపీ ఉపద్యక్షులు వి సాయి కుమార్‌ బాబు,వైస్‌ ఛైర్మన్‌ గడి సత్యవతి,ఎంపిపి గోసాల సుజాత,రెడ్డి ప్రసాద్‌,కాదా ప్రభాకరరావు మునిసిపల్‌ కవిూషనరు కెటి సుధాకర్‌, అనపర్తి ఎఎంసి చైర్మన్‌ పాలిక శ్రీనివాస్‌, ఎంపీడీఓ ఐదం రాజు, అడపా వెంకట లక్ష్మీ,అబ్రహం లింకన్‌, తహశీల్దార్‌ లుకేవీవి సత్యనారాయణ, ఏ సాయి ప్రకాష్‌,సీతా ప్రత్యేక అధికారులు, కార్యదర్సులు తదితర అధికారులు
పాల్గొన్నారు.