మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 4
నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం ఏ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం నే రెడ్ మెట్ డివిజన్లోని యాప్రాల్ భగత్ సింగ్ నగర్, ఎస్వీ నగర్, సూర్య నగర్ ప్రాంతాలలో 55 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం బస్తీలలో పాదయాత్ర చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఏ సమస్య ఉన్న కార్పోరేటర్ దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.స్థానికులు సూచించిన సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి,చెన్నారెడ్డి,ధారా శ్రీనివాసరెడ్డి, మహేష్,రాజు,చిందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.




