రొంపిచర్ల : సుబ్బయ్యపాలెం సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా సానుభూతిపడ్ని వైకాపా వర్గీయులు తీసుకెళుతున్నారంటూ వైకాపా నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారును తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.




