తిరుమల : తిరుమల శ్రీవారిని భాజపా నేతలు దర్శించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నేతలు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, పార్టీ నేతలు నాగం జనార్థన్‌రెడ్డి, బంగారు లక్ష్మణ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు.




