హైవేపై రైతుల ధర్నా
అనంతపురం,నవంబర్1(జనంసాక్షి): సుబ్బరాయసాగర్కు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్ పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. పుట్లూరు ఏ.కొండాపురం వద్ద అనంత-కడప హైవే పై రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుబ్బరాయసాగర్కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాలను ఇచ్చినా ప్రయోజనం లేదంటూ రైతులు వాపోతున్నారు. మూడేళ్లుగా నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే
వేరుశనగ పంటకు సాగు నీటిని అందించాలని సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యంలో రైతులు అనంతపురం- తాడిపత్రి రహదారిని బుధవారం దిగ్బంధించారు. ఈ సందర్భంగా నాయకులు మొదట రైతులతో కలిసి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయానికి ఎదురుగా ఉన్న అనంతపురం-తాడిపత్రి రహదారి విూద బైటాయించారు. ఈ సందర్భంగా అఖఙలపక్ష నేతలు మాట్లాడుతూ వరిపైర్లు వద్దు తడిపైర్లు వేసుకోవాలని పాలకులు, అధికారులు రైతులకు చెబితే వారు చెప్పిన విధంగా మండలంలోని రెడ్డిపల్లి, జంతులూరు, నీలంపల్లి, చెదుల్ల, కొర్రపాడు, రెడ్డిపల్లి, నీలారెడ్డిపల్లి, చెన్నంపల్లి, దయ్యాల కుంటపల్లి, వెంకటాపురం, అగ్రహారం, సంజీవపురం గ్రామాల్లో ఉన్న రైతులు వేరుశనగ, తదితర ఆరుతడి పంటలను సాగు చేశారన్నారు. హెచ్ఎల్సి ఆయకట్టు కింద సెప్టెంబర్ 26 నుంచి వంద రోజులపాటు పంటకు నీటిని విడుదల చేస్తామని అధికారులు హావిూ ఇవ్వటంతో రైతులు వేరుశనగ పంటను సాగుచేశారన్నారు. అయితే పంట చేతికి వస్తున్న తరుణంలో నీటిని నిలుపుదల చేయటం దారుణమన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.




