సూరత్‌లో హార్దిక్ పటేల్ అరెస్ట్

గుజరాత్, సెప్టెంబర్ 19 : నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన పటేల్ ఉద్యమ పోరాట సమితి నేత హార్దిక్ పటేల్‌ను సూరత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హార్దిక్ తలపెట్టిన ఏక్తా యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన నిరసన ర్యాలీ చేయాలని తీర్మానించుకున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించిన గుజరాత్ ప్రభుత్వం హార్దిక్ సహా 78 మందిని అదుపులోకి తీసుకుంది.