Tuesday, 3 November 2026

సూర్యాపేట, జగిత్యాలలో టీఆర్ఎస్ ఆధిక్యం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్‌ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ వెనుకంజలో ఉన్నారు. జగిత్యాలలో ఎం.సంజయ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌) ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి టీ.జీవన్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు.