Friday, 6 November 2026

సెజ్‌ నిర్వాసితులతో పవన్‌ భేటీ

వీరి సమస్యలను ఎందుకు పట్టించుకోరని ప్రశ్న

కాకినాడ,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాకినాడ మూలాపేటలోని సెజ్‌ నిర్వాసితులతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ…అవసరానికి మించి భూములు తీసుకోవడం వల్లే సెజ్‌లు విఫలమయ్యాయని, ప్రభుత్వం వెంటనే వాటిని రద్దు చేయాలని ఆయన కోరారు. కాకినాడ తీరంలో సహజసిద్ధంగా ఏర్పడిన ¬ప్‌ ఐలాండ్‌ను అక్రమంగా తవ్వేశారని, పర్యావరణానికి విఘాతం కల్గించే ఇలాంటి విషయాలు ప్రభుత్వం, ప్రతిపక్షాలకు పట్టదా అని పవన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌ ఎందుకు కాకినాడ ఎస్‌ఈజడ్‌పై మాట్లాడడం లేదని నిలదీశారు. కాకినాడ ఎస్‌ఈజడ్‌లో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. కేవీరావు అనే వ్యక్తి భూములను అడ్డగోలుగా ఇంకో సంస్ధకు అమ్మారని, ఇక్కడ భూములు బీడువారేలా చేసిన కేవీరావు.. అమెరికాలో ద్రాక్షతోటలు కొనుగోలు చేశారని ఆరోపించారు. అడ్డగోలు భూదాహానికి అధికారులు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో పాదయాత్ర చేసిన జగన్‌కి ఎస్‌ఈజడ్‌ సమస్య కనిపించలేదా అని పవన్‌ ప్రశ్నించారు.