Friday, 6 November 2026

వసంతపురస్కారాలు ప్రదానం

తిరుపతి,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాణిపాకంలో నిర్వహించిన వసంత పురస్కారాలు – అవార్డుల ప్రదానం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జడ్పీ చైర్‌పర్సన్‌ ఎస్‌. గీర్వాణి చందప్రకాష్‌, చిత్తూరు మున్సిపాల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కటారి హేమలత, కాణిపాకం ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ మణి నాయుడు గురువారం జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా 21 మందికి వసంత జాతీయ పురస్కారాలు-2018అను అందచేశారు. అవార్డులు అందుకున్న వారిలో పార్థసారథి నాయుడు, గొడుగుచింత గోవిందయ్య, పి.నరేంద్రనాధ రెడ్డి, వేదార్థం హరి, సి.నాగరాజు, ఆర్‌.వెంకట రమణ, కుప్పాల వెంకటసుబ్బయ్య, పాండలూరు దక్షిణామూర్తి, ఎ.నాగభూషన్‌ రెడ్డి, అనసూయమ్మ, జిఎన్‌.వీణాధరి, జెఎస్‌.రాజా కుమార్‌, డాక్టర్‌ కె. ఈశ్వరమ్మ, డాక్టర్‌ ఎమ్‌.రవికుమార్‌, రాజేష్‌, కాశిరాళ్ల చంద్రయ్య, టి.వెంకటేష్‌, కె.రాజేందప్రసాద్‌, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర రావు, ప్రణతిలు ఉన్నారు.ఈ ప్రోగ్రామ్‌లో వీరితో పాటు ఐరాల జడ్పీటీసీ లతాబాబు నాయుడు, ఎంపిపి శాంతమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.విూనాకుమారి, కాణిపాకం మాజీ సర్పంచ్‌ మధుసూదన్‌ నాయుడు, పీపుల్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ హేమలత, అవార్డు గ్రహీతలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.