Wednesday, 4 November 2026

సెయింట్ స్టీఫెన్ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

 

 

 

 

 

పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపల్ సైల్వియా రెడ్డి , సైబర్ క్రైమ్ ఎస్ ఐ గడ్డం మల్లేష్రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, జనవరి27(జనంసాక్షి):-74 వ గణతంత్ర వేడుకలు సెయింట్ స్టీఫెన్ పాఠశాలలో ఘనంగా జరిగాయి. జండా ఆవిష్కరణ వేడుకలు ప్రముఖ ప్రఖ్యాతి చెందిన బైకింగ్ కమ్యూనిటీ అయిన రోడ్ థ్రిల్- హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా రోడ్ థ్రిల్ బైకింగ్ కమ్యూనిటీ సభ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ రూపకల్పనకు చేసిన కృషిని వివరించడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా వీరు హైదరాబాద్ లోని ఉప్పల్ నుండి తమ్మలోనిగుడం లో ఉన్న సెయింట్ స్టీఫెన్ స్కూల్ వరకు బైక్ రైడ్ నిర్వహించి సైబర్ నేరాల పైన అవగాహన కల్పించడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ సైల్వియా రెడ్డి , సైబర్ క్రైమ్ ఎస్ ఐ గడ్డం మల్లేష్ , స్కూల్ సిబ్బంది వెంకట రమణ , రోడ్ థ్రిల్ సభ్యులు జునేష్, మనీష్, ప్రవీణ్ పట్కర్, గోవర్ధన్, పూర్ణ చందర్, తరుణ్, టిల్లు విచేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అయేటందుకు సహకరించిన వీరికి రోడ్ థ్రిల్ వారు కృతజ్ఞతలు తెలిపారు