Friday, 6 November 2026

సెస్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

సెస్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

బిఎస్పీ చొప్పదండి నియోజకవర్గ అద్యక్షులు మాంకాళి తిరుపతి

రాజన్న సిరిసిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెస్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ అద్యక్షులు మాంకాళి తిరుపతి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బిఎస్పీ ఆద్వర్యంలో బోయినపల్లి లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెస్ లో జరుగుతున్న ఎన్నికలు అదికార పార్టీ కనుసన్నల్లోనే నడిచే పరిస్థితి కనపడుతుంది అని అన్నారు.ఎన్నడు లేని విదంగా బకాయి ఉన్న వాళ్లకు ఓటు హక్కును తొలగించడం అంటే ఇది ప్రజాస్వామ్య విరుద్దమే అని వారు పేర్కొన్నారు.సెస్ అదికారుల తప్పిదాల వల్ల చాలా మంది ఓటును కోల్పోతున్నారన్నారు..కావున దీన్ని సవరించి మీటర్ ఉన్న ప్రతి ఒక్కరు ఓటును వినియెాగించుకునేలా చుాడాలని వారు పేర్కొన్నారు.సెస్ అదికారుల అండదండలతో ఓట్లు తీసేయించి ఈ ప్రభుత్వం దొడ్ఢి దారిన గెలవాలని చుాస్తుందని వారు పేర్కొన్నారు.తక్షణమే ఎన్నికలను పాత పద్దతిలో నిర్వహిస్తుా త్వరగా రిజర్వేషన్ లను విడుదలను చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల కన్వినర్లు పెగ్గెర్ల మహెందర్ అక్కనపెల్లి శేఖర్ బిఎస్పీ నాయకులు ఎడపెల్లి ప్రభాకర్ శీను ఈశ్వర్ అలువాల అంజయ్య అనిల్ తదితరులు పాల్గొన్నారు.