Thursday, 5 November 2026

సేవ్ జర్నలిజం డే” ను విజయవంతం చేయాలి

హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి) : ఈ నెల 23న దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నిర్వహించనున్న ” సేవ్ జర్నలిజం” ను విజయవంతం చేయాలని టి యు డబ్ల్యూ జె యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్ కేంద్రాలలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమానీకి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టీవీఎల్, బాసవోజు శ్రీనివాస చారి, దాచేపల్లి దయాకర్ రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్ రావు, కిత రామనాథం, దేనమకొండ శేషం రాజు, దేవరం రాంరెడ్డి, కోమరాజు అంజయ్య, దేవరం వెంకటరెడ్డి, చిట్టిపోతుల రమేష్ బాబు, ఇట్టి మల్ల రామకృష్ణ, ఇందిరాల రామకృష్ణ, బాచి మంచి చంద్రశేఖర్ పాల్గొన్నారు.